జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుకా నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుకా ఇట్లా కుండలెంబడి తిరిగే… తెడ్డుకేమెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… వనము సింగారంబు… కోయిలకెరుకా వనము సింగారంబు… కోయిలకెరుకా ఇట్లా కంపాలెంబడి తిరిగే… కాకికేమెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… బాటాసింగారంబు… అశ్వానికెరుకా బాటాసింగారంబు… అశ్వానికెరుకా ఇట్లా గరికా తుట్టెలు తినే… గాడిదకేమెరుకా //జ్ఞానికే ఎరుక// నాగస్వరము మోత… నాగుపాముకెరుకా నాగస్వరము మోత… నాగుపాముకెరుకా ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్యాకేమెరుకా //జ్ఞానికే ఎరుక// మడుగు సింగారంబు… మత్స్యానికెరుకా మడుగు సింగారంబు… మత్స్యానికెరుకా ఇట్లా కడలా కడలా తిరిగే… కప్పాకేమెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… సద్గురుడుండే మరుగు… ||4|| ఓ ఓ ఓ ఓఓ… ఓఓ ఓఓ
No comments:
Post a Comment